ఎంపీ జేసీ వివాదంపై.. 

అధిష్టానం దృష్టి
-జేసీ తీరుపై పార్టీ నేతల అసంతృప్తి
– చంద్రబాబు ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి
– జేసీ సమస్యలపై ప్రభాకర్‌ను ఆరాతీసిన చంద్రబాబు
అమరావతి, జులై19(జ‌నం సాక్షి) : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో జేసీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. జేసీ అసంతృప్తికి కారణాలు తెలుసుకొని పరిష్కరించే పనిలో తెదేపా అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంపై ఉన్న రాజకీయ కారణాలపై పార్టీ పెద్దలు అరా తీస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. జేసీ వ్యవహారంపై సీఎంతో ఆయన చర్చించనున్నారు.  సమస్య రాత్రికల్లా సమిసిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే
టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరీ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి స్పందించారు. తనతో చంద్రబాబు మాట్లాడారో లేదో.. ఆయనకే తెలియదు అంటూ సుజనా చౌదరీని ఉద్దేశించి మాట్లాడారు. గురువారం విూడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను పార్లమెంట్‌కు వెళ్లటం లేదని స్పష్టం చేశారు. తనతో ఎవరూ చర్చలు జరపలేదన్నారు. తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని తెలిపారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, మోదీ సర్కార్‌కు సంపూర్ణ మెజార్టీ ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. అంతకుముందు లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటం ఖాయమంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుజనా చౌదరీ స్పందిస్తూ.. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. జేసీ దివాకర్‌ రెడ్డి తమ పార్టీలో సీనియర్‌ నేత అని, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని విూడియా ద్వారానే తాను చూశానని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం కూడా జేసీతో తాను మాట్లాడానని చెప్పారు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే పార్లమెంటుకు రాలేకపోయానని తనతో జేసీ చెప్పారని తెలిపారు. పార్టీపై ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే.. అది మాతో చెబితే చర్చించుకుని సరి చేసుకుంటామన్నారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ పార్లమెంటుకు హాజరు అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు.

తాజావార్తలు