ఎంపీ సోయం బాబురావుకు బిజెపి నేతలు స్వాగతం
జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి:
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడులో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావుకు సాయిబాబా ఆలయం వద్ద బిజెపి నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, ఖమ్మం జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్ల అరుణ, బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాదు, వందనపు సుబ్బు పలువురు ఎంపి బాబురావును శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కొమరం భీం విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.