ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన సిపిఐ వైరా నేత విజయబాయి

 

జూలూరుపాడు, ఆగష్టు 10, జనంసాక్షి: విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎఐఎస్ఎఫ్ ఆవిర్భవించి నిరంతరం పోరాటాలు సాగిస్తుందని సిపిఐ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయభాయి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, ఎఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జర్పుల ఉపేందర్ అన్నారు. బుధవారం జూలూరుపాడులో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధిని నిర్దేశించే విద్య రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించి కార్పొరేట్ కబంధహస్తాల్లో విద్యారంగాన్ని మమేకం చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాసంస్థల్లో సరిపడా బడ్జెట్ లేక అధ్యాపకులు లేక సంక్షోభనికి గురవుతున్నాయని ఆరోపించారు. కొఠారి కమిషన్ సిఫారసు ప్రకారం కేంద్ర జిడిపిలో 6 శాతం, కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని సూచించినా నేటి పాలకులు ఆ ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభకు అన్ని జిల్లాల నుండి 700 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కొత్తగూడెంలో 26, 27, 28 తేదీల్లో జరుగనున్న రాష్ట్ర మహాసభలకు విద్యార్థులు, సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు చాంద్ పాషా, పగడాల అఖిల్, గార్లపాటి వీరభద్రం, పత్తిపాటి మహేష్, వెంకటేష్, వంశీ, రాము తదితరులు పాల్గొన్నారు.