ఎన్నికల సంఘం మార్గదర్శకాల ననుసరించి అభ్యర్థుల ఎన్నికల వ్యయం నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

మీడియా సర్టిపీకేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎం.సి.ఎం.సి) ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియా లో ప్రకటనల కు రాజకీయ పార్టీలు ,అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలి*
నల్గొండ బ్యూరో, జనం సాక్షి ,అక్టోబర్ 8 మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయం ఎన్నికల వ్యయ నియంత్రణ కమిటీలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.శనివారం చండూర్ ఎం.పి.డి.ఓ కార్యాలయం లో సహాయ వ్యయ నియంత్రణ అధికారులు, ప్లయింగ్ స్క్వా డ్స్, అకౌంటింగ్ టీం సభ్యులకు,జిల్లా మీడియా సర్టిపీకేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎం.సి.ఎం.సి) టీమ్ లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్తమం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఎన్నికల ప్రవర్తనా నియావళి ఉల్లంఘనలు లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు పకడ్బందీ గా ఎన్నికల వ్యయం నమోదు చేయాలని అన్నారు. ఎన్నికల సహాయ వ్యయ నియంత్రణ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ , అకౌంటింగ్ టీం సభ్యులు ఎన్నికల వ్యయ నియంత్రణ పర్యవేక్షించాలని అన్నారు. మును గోడ్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు 40 లక్షల రూ.లు గరిష్ట వ్యయ పరిమితిగా ఎన్నికల సంఘం నిర్టేశించిందని అన్నారు.ఎన్నికలలో డబ్బులు పంపిణీ,మద్యం నియంత్రణ కు ప్లయింగ్ స్క్వాడ్స్ టీం లు నిఘా ఉంచాలని అన్నారు.
పోటీ చేస్తున్న అభ్యర్థుల వారీగా రిజిస్టర్ లు నిర్వహించాలని అన్నారు.వి.ఎస్.టి బృందాలు చురుగ్గా నిఘా ఉంచాలని అన్నారు..ప్రింట్ మీడియా,లోకల్ ఛానెల్స్ లో వచ్చే ప్రకటనలు అకౌంటింగ్ టీం సభ్యులు ప్రచార వ్యయంలో నమోదు చెయాల ని అన్నారు ఏ.ఈ.ఓ.లు ప్రతి రోజు రిపోర్ట్స్ జిల్లా ఎన్నికల వ్యయ నియంత్రణ కమిటీ నోడల్ అధికారికి సమర్పించాలని అన్నారు.అభ్యర్థులు 10 వేల రూ.లు దాటితే చెక్కు ద్వారా ఎన్నికల వ్యయం చెల్లింపు చేయాలని తెలిపారు.
మీడియా సర్టిపీకేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియా,ప్రింట్ మీడియా ప్రకటనల పై,పెయిడ్ న్యూస్ పై పర్యవేక్షణ చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.అభ్యర్థులు ,రాజకీయ పార్టీలు జారీ చేసే ఎన్నికల ప్రకటనలు ఎన్నికల నమోదు వ్యయం లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.మీడియా లో పెయిడ్ న్యూస్ పై కమిటీ పరిశీలన చేయ నున్నట్లు తెలిపారు.ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియా,లోకల్ చానళ్ళు లో ఎన్నికల ప్రకటనల ప్రసారం కు మీడియా సర్టిపీకేషన్ కమిటీ అనుమతి ముందస్తుగా తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల వ్యయ నియంత్రణ కమిటీ ద్వారా ఎన్నికల వ్యయం,ప్రచార ఖర్చులు నమోదు,మీడియా సర్టిపీకేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు మాస్టర్ ట్రైనర్ బాలు శిక్షణ కార్యక్రమం లో అవగాహన కలిగించారు.ఈ సమావేశం లో నల్గొండ ఆర్.డి.ఓ. జయ చంద్ర రెడ్డి,మీడియా సర్టిపీకేషన్,మానిటరింగ్ కమిటీ నోడల్ అధికారి,డి. పి.ఆర్.ఓ పి.శ్రీనివాస్,ఎన్నికల వ్యయ పరిశీలన కమిటీ నోడల్ అధికారి,డి. సి.ఓ రాజేందర్ రెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి,డి.ఈ. ఓ భిక్షపతి తదితరులు ఉన్నారు



