ఎన్‌ఆర్‌సీ జాబితా నుండి.. 

భారతీయులను తొలగించేది లేదు
– ఈ ప్రక్రియ సుప్రింకోర్టు పర్యవేక్షిస్తోంది
– పూర్తిగా న్యాయంగా, పారదర్శకంగా జరుగుతోంది
– రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి
– తృణముల్‌ సభ్యుల ఆందోళనలతో దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ, ఆగస్టు3(జ‌నం సాక్షి) : అస్సాంలో జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదాపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టి హావిూ ఇచ్చారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ఈ జాబితా నుంచి భారతీయులను తొలగించేది లేదని భరోసా ఇచ్చారు. ఈ పక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఇది పూర్తిగా న్యాయంగా, పారదర్శకంగా జరుగుతోందన్నారు. భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసుకోగలిగినవారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్య తీసుకోబోమని తెలిపారు. కనీసం ఒక్క భారతీయ పౌరుడినైనా ఈ జాబితా నుంచి వదిలిపెట్టేది లేదన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. 1951 తర్వాత ఎన్‌ఆర్‌సీని ఆధునికీకరించడం ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్‌ నుంచి మన దేశానికి అక్రమంగా వలస వచ్చినవారి జాబితా తయారు చేసేందుకు ఈ పక్రియ జరుగుతోంది. బంగ్లాదేశ్‌ వలసదారుల పేరుతో అస్సాంలోని ముస్లింలను పంపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌, టీఎంసీ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రశాంతతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయకూడదన్నారు. ఈ పక్రియకు అందరి మద్దతును కోరుతున్నట్లు తెలిపారు. ఈ పక్రియ సజావుగా జరిగేందుకు మనమంతా కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
రాత్రంతా నిర్బంధంలో తృణమూల్‌ నేతలు..
అసోంలోని ప్రజలను కలిసేందుకు వెళ్లిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు గురువారం రాత్రంతా నిర్బంధం అనంతరం శుక్రవారం ఉదయం అసోం నుంచి వెళ్లిపోయారు. ఎనిమిది మంది సభ్యుల బృందంలోని ఆరుగురు ప్రతినిధులు అసోం నుంచి తిరిగి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల అసోం విడుదల చేసిన జాతీయ పౌర రిజిస్టార్‌(ఎన్‌ఆర్‌సీ) జాబితాలో 40లక్షల మంది పేర్లు లేని నేపథ్యంలో అసోంలో పరిస్థితిని సవిూక్షించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎనిమిది మంది సభ్యుల బృందాన్ని నిన్న అసోంకు పంపించారు. అయితే వారిని పోలీసులు గురువారం సిల్‌చార్‌ విమానాశ్రయంలోనే అడ్డుకుని వీఐపీ లాంజ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
వారిని రాత్రి మొత్తం విమానాశ్రయంలోనే నిర్బంధించారు. ఆ బృందంలోని ఆరుగురు ప్రతినిధులు అసోం విడిచి వెళ్లారని, మరో ఇద్దరు ఎంపీలు మమతబాల ఠాకూర్‌, అర్పితా ఘోష్‌లు శుక్రవారం సాయంత్రం రాష్ట్రం వదిలి వెళ్తారని కచార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.లక్ష్మణ్‌ వెల్లడించారు. ‘మేము వెనక్కి వెళ్తున్నాము. పోలీసులు మమ్మల్ని అనుమతించడంలేదు. మేము రాత్రంతా విమానాశ్రయంలోని మూడు గదుల్లో ఉన్నాం అని రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ వెల్లడించారు. రాయ్‌తో పాటు ఎంపీలు కకోలి
ఘోష్‌ దస్తిదర్‌, రత్న డే నాగ్‌, నదిముల్‌ హాక్‌, పశ్చిమ్‌బంగా మంత్రి ఫర్హాద్‌ హకిమ్‌, ఎమ్మెల్యే మౌహువా మైత్రా నిర్బంధించిన వారిలో ఉన్నారు. తమ ప్రతినిధులును నిర్బంధించడంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా దేశంలో సూపర్‌ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని కల్పిస్తోందని మండిపడ్డారు.
లోక్‌సభలో తృణముల్‌ ఎంపీల ఆందోళన..
తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను అసోంలో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం లోక్‌సభలో తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో లోక్‌సభలో గందరగోళం నెలకొన్నది. దీంతో స్పీకర్‌ సభను ఉదయం వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభించిన అనంతరం కూడా సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు శుక్రవారం ఆరుగురు సభ్యుల తృణమూల్‌ నేతల బృందం కూడా అసోంకు వెళ్లింది. తాజాగా వెళ్లిన తృణమూల్‌ బృందంలో.. రాజ్యసభ ఎంపీ సుకేందు శేఖర్‌ రాయ్‌, ఎంపీలు కకోలి ఘోష్‌ దస్తిదార్‌, రత్న దే నాగ్‌, నడిముల్‌ హక్‌, బెంగా ల్‌ మంత్రి ఫిర్హద్‌ హకిమ్‌, ఎమ్మెల్యే మొహువా మైత్రాలు ఉన్నారు.