ఎపికి ఇచ్చిన హావిూలపై ప్రధాని దృష్టి
రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కృషి: జివిఎల్
న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీ ప్రజలకు ఇచ్చిన హావిూలను పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పం కనిపిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఆగిపోయిన 6 రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయమని కేంద్ర రైల్వే మంత్రిని కోరానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో ముందుకు రావాలని, కొంత నిధులు కూడా కేటాయించాలని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండిరగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరానని, విశాఖపట్నం నుంచి వారాణసికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరానని ఆయన వెల్లడిరచారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ఇస్తామన్న ప్రత్యేక హోదాయే కావాలంటే ఆంధ్రప్రదేశ్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, దయచేసి ఏపీని అలా చేయవద్దని మనవి అని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక ప్యాకేజీ ని మోడి ప్రభుత్వం ఇచ్చిందని ఆయన వెల్లడిరచారు. ముందు ఒప్పుకున్న చంద్రబాబు తర్వాత ఏమైందో తిరస్కరించారని ఆయన విమర్శించారు.