ఎపిలో కొనసాగుతున్న ఎయిడెడ్‌ సంస్థల అప్పగింత

ఎయిడ్‌ ఆగిపోవడంతో ఫీజలు మోత
ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు
విజయవాడ,నవంబర్‌2 జనంసాక్షి   : ఎపిలో ప్రభుత్వ ఒత్తిడితో అనేక ఎయిడెడ్‌ పాటశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఓ వైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నా వీటి అప్పగింతలు ఆగడం లేదు. ప్రభుత్వ తీరును విపక్ష టిడిపి గట్టిగానే తప్పుపట్టింది. ఇది సరికాదని, పునరాలోచన చేయాలని కోరింది. అయితే ప్రభుత్వం దీనిని ఖాతరు చేయడం లేదు. నెల్లూరు జిల్లాలో 120 ఎయిడ్‌ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన
విఆర్‌ విద్యా సంస్థలతో పాటు మొత్తం పది విద్యాసంస్థలు ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించాయి. మిగిలిన విద్యా సంస్థలన్నీ ప్రైవేట్‌కు మొగ్గు చూపాయి. వాటిలో సమారు 12 వేల మంది చదువుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 236 ఎయిడెడ్‌ పాఠశాలలకుగానూ వాటిలో 44 పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరిం చాయి. ప్రైవేట్‌గా నిర్వహించుకోవడానికి ముందుకొచ్చిన 192 పాఠశాలల్లోని 11,750 మంది, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 14,333 మంది విద్యార్థులపై ఫీజుల భారం పడనుంది. విశాఖ జిల్లాలో 89 పాఠశాలల్లో 62 ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపాయి. వాటిలో 9,606 మంది చదువుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఎఎంఎఎల్‌ కళాశాల, ఎవిఎన్‌ కళాశాల ప్రయివేట్‌ వైపు మొగ్గు చూపింది. కృష్ణా జిల్లాలోని శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాల, హిందూ కళాశాలల్లో ఎయిడెడ్‌ గా ఉన్నప్పుడు, ప్రైవేట్‌గా మారిన తర్వాత ఫీజులు ఇలా ఉన్నాయి.గుంటూరు జిల్లాలో 365 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపిన 257 పాఠశాలల్లో సుమారు ఏడు వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రసిద్ధి చెందిన హిందూ కళాశాల, ఆంధ్రా కైస్త్రవ కళాశాల, టిజెపిఎస్‌ కళాశాల సహా మొత్తం 33 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ప్రైవేట్‌పరం కావడంతో సుమారు 15 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడిరది. కడప జిల్లాలో 143 పాఠశాలలు ఉండగా వాటిలో 40 పాఠశాలల విలీనానికి అంగీకరిం చాయి. వీటిలో 15,256 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా అవే పాఠశాలల్లో తాత్కాలికంగా కొనసాగు తున్నారు. ªృష్ణా జిల్లాలో 270 పాఠశాలల్లో రెండిరటిని ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగిం చాయి. మిగిలిన 268 ప్రైవేట్‌ వైపు మొగ్గుచూపాయి. ఈ పాఠశాలల్లో 18,803 మంది చదువుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా 41 సిబిసిఎన్‌సి మిషనరీ పాఠశాలల వివరాలను జిల్లా అధికారులు సేకరించలేదు. ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి హిందూ కళాశాల, ఆంధ్ర జాతీయ కళాశాల, హిందూ కళాశాలలు ప్రయివేట్‌గా మారడంతో ఫీజుల మోత మోగింది. విజయనగరం జిల్లాలో ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఐదు ఉన్నాయి. వాటిలో పార్వతీపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రభుత్వంలో విలీనానికి అంగీకరిం చింది. మిగిలిన వాటిలో ప్రసిద్ధి చెందిన విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాల, మహారాజా ఉమెన్స్‌ కాలేజీ, బొబ్బిలిలోని రాజా కళాశాల, గిరవిడిలోని ఎస్‌డిఎస్‌ కళాశాల ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపాయి. వాటిలో సుమారు రెండు వేల మంది చదువుతున్నారు. 70 పాఠశాలల్లో 33 పాఠశాలలు ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపాయి. చిత్తూరు జిల్లాలోని 54 పాఠశాలల్లో 49 పాఠశాలలు ప్రైవేట్‌పరం అయ్యాయి. వాటిలో సుమారు నాలుగు వేల మంది చదువుతున్నారు. వీటిలో వందలాది మంది చదువుతున్నారు.