ఎపిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

జిల్లాల్లో పతాకావిష్కరణలు చేసిన మంత్రులు

పలు జిల్లాల్లో పతాకావిష్కరణలు చేసిన నాయకులు

అమరావతి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఎపిలో పంద్రాగస్ట్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూరా పతాకావిష్కరణలు జరిగాయి. అధికారులు, అనధికారులు జెండా పండగలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు త్రివర్ణపతాకాలను ఎగురవేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం నివాసంలో జరిగిన స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లాల్లో మంత్రులు పతాకావిష్కరణలు చేసి,పోలీస్‌ గౌరవ వందనాలు స్వీకరించారు. ఒంగోలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, ఎస్పీ సత్య ఏసుబాబు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో స్వాతంత్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు జెండా ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. కడప పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. పోలీస్‌ గౌరవ వందనం స్పీవకరించారు. అధికరారులు,అనధికారులు ఇందులో పాల్గొన్నారు. నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్‌, మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చిత్తూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్యద్రినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జ్‌, మంత్రి నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. విజయనగరం స్వాతంత్యద్రినోత్సవాన్ని పురస్కరించుకుని జోరు వానలోనూ మంత్రి గంటా శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేశారు. మచిలీపట్నం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంత్రి పరిటాల సునీత జాతీయ పతాకాన్ని ఎగువవేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్యద్రినోత్సవం సందర్భంగా కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒంగోలు టీడీపీకార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలో గిడ్డంగుల సంస్ధ రాష్ట్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. సచివాలయం మొదటి బ్లాక్‌ వద్ద రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. సిబ్బంది, ఎస్పీఎఫ్‌ పోలీసులు వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీహరికోటలో డైరెక్టర్‌ పాండియాన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. శాస్త్రవేత్తలు వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ ఆర్టీసీ భవన్‌లో జాతీయ పతాకాన్ని చైర్మన్‌ వర్ల రామయ్య ఎగురవేశారు. కార్మికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వరరావు, కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు జాతీయ జెండా

 

తాజావార్తలు