ఎపి అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు

బిజెపిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం

రాహుల్‌ ప్రధాని అయితేనే ప్రత్యేక¬దా సాధ్యం

1న ప్రత్యేక¬దా సాధానసమితి బంద్‌కు మద్దతు

విూడియా సమావేశంలో ఉమెన్‌ చాందీ, రఘువీరా

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం నిర్ణయించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పొత్తులపై తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌

గాంధీదేనని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు గానీ బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమతో ఉంటారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన రఘువీరాతో కలసి విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని,పస్రత్యేక మోదా వస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. విభజన హావిూలు అమలు చేసేది, ఏపీకి ప్రత్యేక ¬దా తెచ్చేది కాంగ్రెస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రత్యేక ¬దా సాధన సమితి ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని, ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు. పొత్తులపై నిర్ణయం తీసుకుంది ఏఐసీసీయేనని, ప్రియాంక గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీచేస్తున్నట్టు ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు జరగాలంటే హస్తం గుర్తుకే ఓటెయ్యాలన్నారు. వేరే ఎవరికి ఓటు వేసినా.. నష్టమని.. వేరేవాళ్లకు ఓట్లు వేస్తే… వారికి మాత్రమే ప్రయోజనమన్నారు. ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.. ఏపీ ఇంఛార్జి ఉమెన్‌ చాందీ ద్వారా తమకు తెలియజేశారని రఘువీరా తెలిపారు. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. ఈ నెల 31న అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించి.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న అంశం ఇది అని తెలిపారు. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల రఘువీరా హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త అన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.