ఎపి ప్రయోజనాలపై జగన్‌ మాట్లాడడమా?: పల్లె

అనంతపురం,జనవరి17జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రుల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి కాంక్షిస్తుంటే అందుకు భిన్నంగా జగన్‌ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారని మాజీమంత్రి,ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. అవినీతికి కేరాఫ్‌గా ఉన్న జగన్‌ ప్రత్యేకమోదాతో పాటు ఇతర అంశాలను మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎపి సంక్షేమంపై మాట్లాడటం మరింత విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరి సంక్షేమం కోసం ఎపి ప్రయోజనాలు వ్యతిరేకించిన కెసిఆర్‌/-తో పొత్తుకు తహతహలాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా 12వేల కోట్ల రూపాయలు వెచ్చించామని, పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూడవచ్చన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని నిరంతరం అడ్డుకుంటూ ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షనేత ¬దాకు అనర్హుడని పల్లె ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిసంక్షేమ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టి నిర్వహిస్తోందని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న అరాచక ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారన్నారు