ఎపి శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు
అలాంటి వారిని అదేరోజు సస్పెండ్ చేయాలి
మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ వెల్లడి
విజయవాడ,నవంబర్29((జనం సాక్షి): శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల ఎపీ శాసనసభలో పరిణామాలు చూస్తే ఆవేదన కలుగుతుందని చెప్పారు. శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే… ఆ రోజు సభ్యడిని సస్పెండ్ చేసే విధానం అమల్లోకి తేవాలని కోరారు. దేశవ్యాప్తంగా జరిగే స్పీకర్ల సదస్సులో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం చేయాలని బుద్ద ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో విూడియాతో ప్రతి ఒక్కరూ దాని పవిత్ర తను కాపాడాలన్నారు. వినలేని, వినకూడని పదాలను శాసనసభలో సభ్యులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. స్త్రీలను కూడా కించపరిచేలా శాసనసభలోనే వ్యాఖ్యలు చేస్తున్నారని, నాయకులను ఎదిరించలేక.. ఇంట్లో ఆడవాళ్లను తిట్టే పరిస్థితికి దిగజారారని విమర్శించారు. అసలు ఎటువంటి పదాలు వాడకూడదో అన్న నిబంధనలు ఉన్నాయన్నారు. అలాంటిది సభలో వినలేని, వినకూడని పదాలను సభ్యులు మాట్లాడుతున్నారని, ముఖ్యంగా స్త్రీలను కూడా కించపరిచేలా శాసన సభలో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులను ఎదిరించలేక.. ఇంట్లో ఆడవాళ్లను తిట్టే పరిస్థితికి దిగజారారని విమర్శించారు. శాసన సభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే… ఆ రోజుకు సభ్యుడిని సస్పెండ్ చేసే విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే స్పీకర్ల సదస్సులో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం చేయాలన్నారు. ఇలాంటివి అమలు చేస్తేనే శాసన సభ పవిత్రను కాపాడే అవకాశం ఉంటుందని మండలి బుద్ద ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.