ఎమ్మార్వో ఆఫీస్ కు తాళం. కార్యాలయం ముందు బైఠాయించి. విఆర్ఏ లు ఆందోళ
రాయికోడ్ జనం సాక్షి 10 రాయికోడ్ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసనకు దిగారు. విఆర్ఏ లు చేపట్టిన 78వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు కార్యాలయానికి తాళం వేసి అడ్డుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని ఆఫీస్ కు తాళం వేసి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది ఆఫీస్ లోకి వెళ్లకుండా అడ్డుకుని.. ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ జీవో ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. వేతనానికి మించి వీఆర్ఏ లతో ప్రభుత్వం పని చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాల పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
తక్కువ జీతం ఇస్తూ.. వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించిన ప్రకారం పే స్కేల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల వీఆర్ఏ ల సంఘం అధ్యక్షుడు జిపి రత్నం, ఉపాధ్యక్షుడు శివకుమార్, మండలంలోని అన్ని గ్రామాల గ్రామాసేవకులు పాల్గొన్నారు.
Attachments area