ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పై మేనేజ్మెంట్ అధిక ఫీజుల దందా

ఫైన్ ల రూపంలో లక్షల్లో దోపిడి
ఆగ్రహానికి గురైన మెడికల్ కాలేజ్ విద్యార్థులు
మెడికల్ కాలేజ్ గేటు వద్ద నిరసన
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
ఎమ్మెన్నార్ మెడికల్  కాలేజ్ విద్యార్థులపై. ఎమ్మెన్నార్ కాలేజ్ యజమాన్యం అధిక ఫీజులు, ఫైన్ ల రూపంలో లక్షల్లో  వసూళ్ల దోపిడి , ఆగ్రహానికి గురై నిరసన తెలిపిన మెడికల్ కాలేజ్ విద్యార్థులు సంఘటన సంగారెడ్డి మండలం పసల్ వాది గ్రామ శివారులో గల ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పై మేనేజ్మెంట్ అధిక ఫీజులు ఫైన్ రూపంలో లక్షల్లో దోపిడి వసూలు  చేస్తున్నారని విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఆవేదన  వ్యక్తం చేశారు అధిక వసూలు చేస్తున్న ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీ యాజమాన్యం  ఎమ్మెన్నార్ కాలేజీ యాజమాన్యం  విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ఎలాంటి గౌరవం లేదని  ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వారు అని  ఆవేదన వ్యక్తం చేశారు   కోటి 25 లక్షలు రూపాయలు క ట్టి మేనేజ్మెంట్ సీటు ,  విద్యార్థులపై ఫైన్ ల రూపంలో ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీలో దోపిడి . కాలేజీ ఎలాంటి సౌకర్యాలు లేవు మా పిల్లలను .ఎమ్మెన్నార్ కాలేజ్ లో చేర్పించి తపుచేశము  నష్టపోయామని అన్నారు లేట్ ప్లీజ్ పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ఎమ్మెన్నార్  కళశాలలో వైద్య విద్యార్థులు తమ పట్ల యాజమాన్యం కర్కశంగా వ్యవహరిస్తుందని, తమకు న్యాయం చేయాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విడతల వారిగా కట్టాల్సిన ఫీజులను మొదటి సంవత్సరమే రెండవ సంవత్సరం ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ విద్యార్థి ఎవరైనా మొదటి సంవత్సరం ఫెయిల్ అయితే ఇన్స్టంట్ పరీక్షలు రాయడానికి మూడవ సంవత్సరం ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ ఫీజులు కట్టడం లేట్ అయితే రోజుకు 1400 ఫైన్ వేస్తున్నారని, ఫైన్ కట్టని పక్షంలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థి ఫీజు కట్టడం లేట్ అయితే ఏకంగా యాబై నాలుగు వేల రూపాయలు ఫైన్ వేశారని, ఆ మొత్తం కట్టాను అని రసీదు చూపెడుతూ తను ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం విద్యార్థులు ఎమ్మెన్నార్ కాలేజ్ గేట్ వద్ద బైఠాయించి ‘వీ వాంట్ జస్టిస్’ అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళశాల కు వస్తే ప్రిన్సిపాల్ తమతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి మెడిసిన్ సీట్లు రద్దు చేసినా క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు అన్నారు. ఇప్పటికైన అధికారులు, ఎమ్మెన్నార్  యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.