ఎమ్మెల్యేగానే పోటీచేస్తా, ఎంపిగా కాదు : బాలకృష్ణ
హైదరాబాద్ : తాను లోక్‌సభకు పోటీ చేయనున్నట్లువచ్చిన మీడియా వార్తలను నందమూరిహీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కోట్టిపారేశారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని స్ఫష్టం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ లోకసభకు పోటీ చేయనున్నట్లుఇటీవల వార్తలు వచ్చాయి అవార్తల్లో నిజం లేదని అయన అన్నారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. పార్టీని వీడేవారంతా అవకాశవాదులేనని అయన అభిప్రాయపడ్డారు. కోందరు పార్టీని వీడినా నష్టంలేదని అయన అన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాదారణమేనని అయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కోంత మంది వలసలు పోతున్నారని అయన విమర్సించారు.ప్రజల బలం తమ పార్టీకి ఉందని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో తాను కూడా చెప్తానని పార్టీలో చర్చించిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని అయన అన్నారు. వెళ్లేవారు వెళ్లినా పరవాలేదని పార్టీని తాము బలోపేతం చేసుకుంటామని అయన అన్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి కూడా వలసలను ప్రోత్సహించారని. అయన విమర్శించారు. పార్టీ నిర్ణయాన్ని శిరనావహిస్తానని అయన చెప్పారు.తాను శాసనసభకే పోటీ చేస్తానని బాలకృష్ణ మొదటి నుంచీ చెబుతున్నాయి. అయితే పార్టీ సీనియర్లను బలమైన అభ్యర్థులను లోక్‌సభకు పోటీ చెయించాలనే పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడి ప్రణాళికలో భాగంగా బాలకృష్ణను హిందుపురం నుంచీ పోటీకి దించుతారని వార్తలు వచ్చాయి.బాలకృష్ణ పోటీ చేయడానికి అనువైన శాసనసభా స్థానాలు చాలానే ఉన్నాయి,కృష్ణాజిల్లా గుడివాడ అనంతపురం జిల్లా హిందుపురం వంటి స్థానాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరోరెండు మూడు సీట్లు కూడా అయన పోటీ చేయడానికి అవకాశం ఇచ్చే స్థానాలు ఉన్నాయి.