ఎమ్మెల్సీ అభ్యర్థికి గుండెపోటు
కరీంనగర్ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లి రాజమౌళికి గురువారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆయన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనను తెదేపా జిల్లా అద్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమరావు పరామర్శించారు.