ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్
కరీంనగర్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, వరదారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతే తెలంగాణ వాదమే లేదని సీమాంధ్రోళ్లు ప్రచారం చేస్తారు. అని పేర్కొన్నారు. ఉద్యమంలో స్వామిగౌడ్ పాత్ర ఏంటో అందరికీ తెలుసని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహమూద్ అలీని కేసీఆర్ ప్రకటించారు. మహమూద్ అలీకి నాగం జనార్థన్‌రెడ్డి మద్దతు తెలపడంతో ఆయనకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మహమూద్ అలీ మైనార్టీ అభ్యర్థి అయినందున మజ్లిన్ పార్టీ కూడా మద్దతివ్వాలని అసదుద్దీన్ ఓవైసీకి అప్పీల్ చేశారు.