ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై అధికారులకు అవగాహన

కరీంనగర్‌, జనవరి 31 (): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై ఎన్నికల అధికారులకు అవగాహన నిమిత్తం కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో గురువారం మాక్‌ పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ , స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలున్నా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కరీంనగర్‌ ప్రధాన కేంద్రం కావున ఎన్నికల నిర్వహణ సిబ్బంది అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిన్న చిన్న సందేహాలున్న నివృత్తి చేసుకొని ఎన్నికలు సజావుగా ఎటువంటి లోపాలు లేకుండా జరిగేలా చూడాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ ప్రక్రియపై ఎటువంటి అనుమానాలు లేకుండా సజావుగా సమర్థవంతంగా నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి విశ్రాంతి కార్యదర్శి, ఇసి మెంబర్‌, బ్రహ్మం దృశ్యశ్రవణము ద్వారా వివరిస్తూ, ప్రయోగాత్మకంగాచేసి చూపించారు. ఎన్నికల సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెసి హెచ్‌.అరుణ్‌కుమార్‌, డిఆర్‌ఓలు కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లు, కె. కృష్ణారెడ్డి, ప్రకాశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.