ఎయూలో ర్యాగింగ్‌పై గంటా సీరియస్‌

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఆంధ్రయూనివర్శిటీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్‌ అయ్యారు. ఏయూ వీసీతో మాట్లాడిన మంత్రి ర్యాగింగ్‌ ఘటనపై కమిటీ వేయాలని వీసీని ఆదేశించారు. ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం విచారకరమని మంత్రి గంటా అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. హాస్టల్‌లో సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ జూనియర్‌ విద్యార్థులు ఏయూ అధికారులకు ఫిర్యాదు చేశారు

 

తాజావార్తలు