ఎరుకల సంఘం జెండా ఆవిష్కరణ దినోత్సవం
మహబూబాబాద్ టౌన్ సెప్టెంబర్ 30 జనం సాక్షి న్యూస్
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. 1956లో మొదలుకొని 1976 వరకు ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎరుకల కులస్తులు ఎన్నో త్యాగాలను ప్రాణ త్యాగాలను చేసుకొని ఈరోజు ఎస్టి రిజర్వేషన్ సాధించడం జరిగింది వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఎరుకల జాతి ఆత్మగౌరవం అయిన జెండా ఆవిష్కరణ పండుగను జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎగరవేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు పేరం వీరస్వామి స్వామి మాట్లాడుతూ ఎరుకల జాతి కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారు తెచ్చిన ఈ రిజర్వేషన్లు ప్రతి ఒక్క ఎరుకల జాతి బిడ్డ అనుభవించే విధంగా ఉంటేనే వారి త్యాగాలకు అర్థమని ఎస్టీ జాబితాలో ఎన్నో ఎన్నో కులాలు ఉండగా ఆ తరుణంలో ఎస్టీ జాబితాలోని ఎరుకల కులస్తులు అన్ని రిజర్వేషన్లకు దూరం అవుతున్నారని ఇకపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలుకల ప్రజలను గుర్తించుకొని వారి జాతికి కావాల్సిన వారికి అవసరాలను తీర్చాలని కోరారు అదేవిధంగా ఎరుకల జాతి కుల వృత్తులను అదే విధంగా ఎరుకల విద్యార్థులకు ప్రత్యేక కేటగిరి చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపురం సంపత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాగం మల్లయ్య జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నిమశెట్టి మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు రాగం రామచంద్రం రాయపురం శ్రీనివాస్ కుతాడి యాకయ్య కొరివి మండల అధ్యక్షులు పుడుతం వీరభద్రం మహబూబాబాద్ మండల అధ్యక్షులు దాసరి వీరన్న నెల్లికూరు మండల అధ్యక్షులు శ్రీరాములు అప్పలయ దంతాలపల్లి మండల అధ్యక్షులు మానుపాటి సారంగం మాదగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు