ఎర్రకాల్వకు వచ్చిన నష్టమేవిూ లేదు

వార్తలపై ఇంజనీర్‌ వివరణ

ఏలూరు,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి):ఎర్రకాల్వ రిజర్వాయర్‌ ప్రాజక్ట్‌ గురించి టీవీ న్యూస్‌ ఛానళ్లలో వచ్చిన స్కోల్రింగ్‌లపై ఇరిగేషన్‌ ఎస్‌ఇ రఘునాథ్‌ మంగళవారం వివరణ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. న్యూస్‌ ఛానళ్ల పేర్కొన్నట్లుగా ఎర్రకాల్వ రిజర్వాయర్‌ ప్రాజక్ట్‌ గట్టుకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి కలపదుంగ కొట్టుకొచ్చి గేటుకు అడ్డుగా తగలడం వల్ల ఎర్రకాల్వ రిజర్వాయర్‌ ప్రాజక్టు 4వ గేటు ఒక విూటరు వరకూ పైకి ఎత్తామని చెప్పారు. గేటు ఎత్తే సమయంలో గేటుకు ఉన్న నైలాన్‌ తాడు కొంచం పక్కకు జరిగిందని, మంగళవారం ఉదయం ఆ చిన్న మరమత్తును సరిచేశామని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ నీటి నిల్వ 83.5 విూటర్లు ఉండగా, దిగవ ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నీటి విడుదలను క్రమంగా నియంత్రిస్తున్నామన్నారు.

 

తాజావార్తలు