ఎర్రకూలీలకు డబ్బు జమలపై ఆరా?
చిత్తూరు,డిసెంబర్11 (జనంసాక్షి) కొందరు బడా వ్యాపారవేత్తలు ఎర్రచందనం అక్రమ రావాణాతో కోట్లు సంపాదిస్తున్నారు. వీరంతా అడ్వాన్సుగా కూలీలకు డబ్బులు జమచేస్తున్నారు. దీంతో చర్యలు తీసుకుంటున్నా శేషాచలం అడువుల్లో నరికివేత ఆగడం లేదు. దీంతో అనుమానితుల ఖాతాల్లో చేరిన నగదుపై ఆరా తీస్తున్నాయి. వీరితోపాటు ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్మగ్లర్లు సైతం ఇందులో ఉన్నారనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ వద్ద ఉంది. ప్రధానంగా ఎర్ర కూలీల ఖాతాల్లో భారీగా నగదు జమపై దీనిపై చెన్నైలోని ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖరాశారు. ఈ మేరకు జిల్లాలో కూడా ఎర్ర స్మగ్లర్ల ఖాతాలపై ఆరా తీస్తున్నారు. వీరు ఎక్కడెక్కడ నగదు జమచేస్తున్నారో..వీరికి ఇక్కడ ఏజెంట్లుగా ఉన్న వారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు. పెద్దమొత్తాలు జమచేసిన వారిపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీలో కేసులు నమోదైన స్మగ్లర్ల వివరాల జాబితాను పరిశీలిస్తున్నారు.