ఎల్‌ఇడిలతో విద్యుత్‌ పొదుపు

అమరావతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): విద్యుత్‌ పొదుపు చేసే పక్రియలో భాగంగా జిల్లాల్లో ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పర్యావరణపరంగా కూడా మేలని నిపుణులు అంటున్నారు. సీఎల్‌ఎఫ్‌ బల్పుల అమలుకు సంబంధించి జిల్లా అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేఅవకాశం ఉంది. ఈ పథకం సంబంధించి అమలు జరిగితే విద్యుత్‌ బాగా పొదుపు చేసే అవకాశం ఉంది. వినియెగంలో రెట్టింపు వెలుతురుతోపాటు వాతావరణంలో కూలింగ్‌ ఉండటమే కాక విద్యుత్తును ఆదా చేసుకునేందుకు ప్రస్తుత పరిస్థితు ల్లో ఇలాంటి ప్రయెగం అవసరం ఉందని పలువురు అంటున్నారు. వీధిలైట్ల మార్పునకు సంబంధించి అవసరమై ప్రాంతాలను గుర్తించారు. ఇకపోతే ఒక్కొక్క ఇంటికి రెండు బల్బుల చొప్పున ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు పంపారు.

 

తాజావార్తలు