ఎస్టీ హాస్టల్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని
సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె
టేకులపల్లి, ఆగస్టు 10( జనం సాక్షి ): ఎస్టి హాస్టల్ వర్కర్స్ 14 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల డైలీ వేజ్ వర్కర్లు 9 నెలలు, పిఎంహెచ్ హాస్టల్ ఔట్సోర్సింగ్ వర్కర్లకు 14 నెలలుగా వేతనాలు రావడం లేదు. వాళ్ల వేతనాలు తక్షణం విడుదల చేయాలని ఆగస్టు 9వ తారీకు నుండి జిల్లాలోని 64 ఆశ్రమ పాఠశాలలు, 22 పీఎంహెచ్ హాస్టల్లోని 600 మంది వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లు, అవుట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో గర్ల్స్ ఎస్ ఎం ఎస్ హాస్టల్ ముందు ధర్నాలో వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోలెం సుజాత, కల్తీ శ్రీను,పాయం విజయబారతి,కుంజ జయమ్మ,తాటి భారతి, కిషన్,అనిత తదితరులు
పాల్గొన్నారు.