‘ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరిస్తాం’
ఆదిలాబాద్, నవంబర్ 29 : ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరించాలని ఆదివాసి సంఘం నేత శ్రీరామ్ శంభు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పాదయాత్రలో ఆదివాసీల విషయంలో మాట్లాడకుండా ప్రధానంగా లంబాడీలపై సమస్యలపై మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలోని గిరిజనుల్లో అత్యధికంగా ఆదివాసీలు ఉన్నప్పటికీ చంద్రబాబు వారిని గుర్తించకపోవటం, సమస్యలను ప్రస్తావించకపోవడాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో జిల్లాలో చేపట్టనున్న చంద్రబాబు పాదయాత్రను ఆదివాసీలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులను ఆదివాసీలకు రాకుండా లంబాడీలు హరించుకుపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను కాపాడే పార్టీలను గుర్తిస్తామని, వారి సంక్షేమాన్ని విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.