ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహాయం

ములుగు జిల్లా
గోవిందరావుపేట అక్టోబర్ 13 (జనం సాక్షి):-
మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పసరలో చదివే దళిత గిరిజన,ఎస్సీ ఎస్టీ,లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు కెనరా బ్యాంకు వారు అందించారు.ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సంమేశ్వర్ రావు అధ్యక్షతన స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కెనరా బ్యాంక్ మేనేజర్ పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో చదువుకునే ఎస్సీ ఎస్టి విద్యార్థుల కు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో భాగంగా ఈ పాఠశాల లో చదువులో మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థుల కు 22500.00రూపాయల స్కాలర్ షిప్ ప్రధానోపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది భవిష్యత్తు లో ఇంకా పెద్దమొత్తంలో స్కాలర్ షిప్ ఇస్తామని మేనేజర్ పూర్ణ చందర్ రావు అన్నారు ప్రధానోపాధ్యాయులు సంమేశ్వర్ రావు బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు చంద్రారెడ్డి
చాప బాబు సకృనాయక్,కందిక రాజు వెంకటేష్ మద్దినేని రామ రాజు కూరకుల సమ్మయ్య ,కనకయ్య,పరిమళ, హేమలత,జయమ్మ,శారదా పద్మ,కెనరా బ్యాంక్ సిబ్బంది మేనేజర్ పూర్ణ చందర్ రావు,గోపి,ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.



