ఎస్సీ వర్గీకరణకు పోరాడుతూనే ఉంటాం
గుంటూరు,ఆగస్ట్6(జనం సాక్షి): ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణను మాదిగలు బలంగా కోరకుంటున్నారని మాదిగ ఉద్యోగ సమాఖ్య నేతలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలోని 59 ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణను మాదిగలతో పాటు, ఉపకులాలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు మంద కృష్ణమాదిగ నేతృత్యంలో పోరాటాలు చేస్తున్నామని అన్నారు. ఇదిలావుంటే ఎస్సీ వర్గీకరణ పక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమిస్తామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో భాజపా కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాలల ఆధ్వర్యంలో పోరాటాలు చేసి తమసత్తా చూపుతామని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పక్రియను వెంటనే ఉపసంహరించు కోవాలని వారు డిమాండు చేశారు.