ఎస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి గ్రామసేవా కేంద్రం ప్రారంభోత్సవం.

మనూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో గ్రామసేవా కేంద్రాన్ని సర్పంచ్ శేరి సత్యమ్మ చేతులమీదుగా ప్రారంభించారు.
నారాయణఖేడ్ జూన్15(జనం సాక్షి)
బుధవారం తుమ్నుర్ గ్రామంలో గ్రామ సేవ కేంద్రాన్ని పారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు రాజు మాట్లాడుతూ గ్రామంలో వివిధ పనులతో పాటు మా పాఠశాలలో డిజిటల్ తరగతిని ఏర్పాటు చేయినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంతోషకరమని తెలిపారు
ప్రాజెక్ట్ మేనేజర్ వినయ్ మాట్లాడుతూ  గ్రామంలో ఈ గ్రామసేవా కేంద్రం ద్వారా స్థానికంగానే ప్రతి ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. అలాగే ప్రస్తుత వ్యవసాయ పంటల సాగు కొరకు  అవగాహన కార్యక్రమాలు, అలాగే జిల్లాస్థాయి అధికారులతో కూడా సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మా పరిధిలోని సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేరి సత్యమ్మ, ప్రాజెక్ట్ మేనేజర్ వినయ్, ఉపాధ్యాయులు రాజు, బ్రహ్మానందరెడ్డి, యోహాన్, భవిష్య భారత్ సభ్యులు వెంకటేశ్వర్లు, చంద్రకళ, నాగరాజు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.