ఎ.ఐ.టి.యు.సి.21 వ జిల్లా మహా సభలను జయప్రదం చేయండి.

కోటగిరి సెప్టెంబర్ 19 జనం సాక్షి:-ఈ నెల 22 తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనీ మేరు సంఘంలో నిర్వహించే ఎ.ఐ.టి.యు.సి.21వ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని సి.పి.ఐ మండల కార్యదర్శి పిలుపునిచ్చారు.సోమవారం రోజున ఎ.ఐ.టి.యు.సి.జిల్లా మహా సభల కర పత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ.స్వాతంత్రయానికి పూర్వమే బ్రిటిష్ వారి కాలంలో కార్మిక సంఘాలు లేనప్పుడు ఎ.ఐ.టి.యు.సి.సభ్యులు కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి కార్మికుల హక్కులను సాదించడం జరిగిందన్నారు.కార్మికుల హక్కుల సాధనకై మొట్టమొదటి సారిగా ఏర్పడిన కార్మిక సంఘం ఎ.ఐ.టి.యు.సి.ని కొనియాడారు.
ఎ.ఐ.టి.యు.సి.నాయకత్వంలో అనేక పోరాటాలు
,త్యాగాల చేసి సాధించుకున్న ముఖ్యమైన 44 కార్మిక చట్టాలను నేడు 4 కోడ్ లుగా కుదించిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోనీ మోదీ ప్రభుత్వం కార్మికుల చట్టాలు, హక్కులను తుంగలో తొక్కి,కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహ రిస్తుందన్నారు.రాష్ట్రంలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ వ్యవస్థలను తీసివేసి ప్రతి ఒక్కరికీ రెగ్యులర్ పద్దతిలో నియమించడం, గతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసిన వారికి రెగ్యులర్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నేడు కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ విధానాలను ప్రోస్థహిస్తు,కార్మికుల హక్కులు, సమ్మెలను హరిస్తున్నయన్నారు.ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో నల్ల గంగాధర్, రాజు, రాము,పోశట్టి తదితరులు పాల్గొన్నారు.
.
Attachments area