ఏఐఎస్ఎఫ్ మూడవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
గుండాల,ఆగస్టు22(జనంసాక్షి);గుండాల మండలంలోని స్థానిక పాఠశాలల్లో మరియు కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్ మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ,దేశ స్వతంత్రం కోసం తెలంగాణ సాధన కోసం క్రియాశీలకంగా పని చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని దేశ ప్రధానులుగా రాష్ట్రపతిగా మహోన్నతమైన స్థానాలను అధిరోహించిన వారిలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వహించిన వారే నని, ఇలా ఎంతో మంది మేధావులు అందించిందని, విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కారం మార్గం చూపిందని అలాంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను విద్యార్థులు ,మేధావులు ,మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు జయప్రదం చేయాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి గంగదరి వినయ్,ప్రణయ , విక్రమ్, లక్ష్మణ్,,నసీర్ తదితరులు పాల్గొన్నారు