ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి
గరిడేపల్లి, నవంబర్ 16 (జనం సాక్షి): నవంబర్ 19 తారీఖున నడిగూడెం మండల కేంద్రంలో జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండవ మహసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 1920 సంవత్సరము ఏర్పడిన ఏఐటీయూసీ కార్మిక సంఘం కు 102 సంవత్సరాల చరిత్ర ఉన్నదని కార్మికుల పక్షన  అనేక మిలిటెంట్ పోరాటాలు చేసిన చరిత్ర ఏఐటీయూసీ అని వారు అన్నారు.  కేంద్రం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా  ఏఐటీయూసీ నాయకత్వంలో ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నట్లుగా వారు అన్నారు.ఉదయం 9 గంటలకే ప్రారంభం అయ్యే ఈ మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కార్మికులను కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ మండల నాయకులు ఆనందరావు, జొన్నలగడ్డ తిరపయ్య, ప్రతాని సైదులు,అప్పాచారీ, యడవల్లి వెంకటేశ్వర్లు, పెద్ద మస్తాన్,చిక్కుల శేషగిరి నకిరేకంటి రవి, తదితరులు పాల్గొన్నారు.