ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, జూలై 29 , ( జనం సాక్షి):
ప్రభుత్వం అందజేసిన దుస్తులను ప్రభుత్వ మోడ ల్ స్కూల్ విద్యార్థులకు ,కస్తూర్బా గాంధీ గురుకు ల విద్యాలయం విద్యార్థినిలకు మాజీ తొలి ఉప ముఖ్య మంత్రి, ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజ య్య ముఖ్యఅతిథిగా హాజరై ఏకరూపదుస్తులను   పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎల్ఏ రాజయ్య మాట్లాడుతూ ఆచార్యదేవోభవ అంటే గురువు దేవుడితో సమా నం అని,విద్యఒకవజ్రాయుధమని, చదువు సకల సమస్యలకు పరిష్కారంఅని అన్నారు. ఆచార్య దేవోభవ అంటే గురువు దేవుడితో సమానం అని అర్థం నేను ఈస్థాయిలో మీముందు ఉండి మాట్లా డుతున్నానంటే ఇదిఉపాధ్యాయులు పెట్టిన భిక్షా అని తెలిపారు. చదువు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చదువుతోనే నేను ఈ స్థాయికి వచ్చా నని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను రెసిడెన్షియ ల్ పాఠశాలలను కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయడం కోసం ప్రభుత్వ పాఠ శాలల్లో,ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలోవిద్యా ప్రమాణాలు పెంచాలని తెలంగాణరాష్ట్రప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకురావ డం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తం గా 960 గురుకుల పాఠశాలలు నిర్వహించడమే కాకుండా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్య మైన భోజనం మెనూ ప్రకారం ఇస్తూనే మంచి పౌష్టికాహారంతో కూడినఆహార అందించడం జరు గుతుందని తెలిపారు.నాణ్యమైనభోజనం అందిం చడమే కాకుండా అత్యున్నతప్రమాణాలతో కూడి న నాణ్యమైనవిద్యను అందిస్తున్న ఘనతముఖ్య మంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.  తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసంఅంది స్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని విద్యార్థులకు సూచించారు.జీవితంలో ఒక లక్ష్యాన్నీ ఏర్పరచుకొని ఆలక్ష్యసాధన కోసం నిరం తర కృషి నిరీక్షణ పట్టుదల కసి కృషి ఆత్మవిశ్వా సంతో కష్టపడి చదివినట్లయితే జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలఅధికారులు,ఉపాధ్యాయులు , విద్యార్థులు,నాయకులుతదితరులుపాల్గొన్నారు.