ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులకు కుడా దళిత బంధు ఇవ్వాలి

మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి.

మంగపేట,సెప్టెంబర్ 26 (జనంసాక్షి):-
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల తో పాటు పూర్వం నుండి సహా జీవనం చేస్తున్న ఏజెన్సీ దళితులకు దళిత బంధు ఇవ్వలని గిరిజనులతో పాటు దళితులు పూర్వ కాలం నుంచి ఒకే కుటుంబ సభ్యులుగా అన్న దమ్ములు లాగ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న దళితులకు దళిత బందు ఇవ్వాలని కోరుతున్నట్లు మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి అన్నారు.ఏజెన్సీలో దళితులు బ్రిటిష్ ప్రభుత్వం రావడానికి పూర్వం నుండి క్రీస్తు శకం 1600 కు పూర్వమే భారతదేశంలోని అడవుల్లో కొండల్లో నివసించారని వీరిని బ్రిటిష్ వారు 1835 లో కొండ దళితులు అని పూర్వం పిలిచే వారని అటువంటి ఏజెన్సీలో నివసిస్తు అప్పటి నుండి ఇప్పటి వరకు అడవులు తరిగి పోయి అడవుల మీద,వాటి ప్రతి ఫలాలు మీద ఆధారపడిన దళిత కుటుంబాలు రోజు వారీ కూలీలుగా మారారని,రోజులు మారాయి కానీ దళితుల జీవితాలు మారలేదు,దళితుల కుటుంబాలు దయనీయమైన పేదరికంలో నివసిస్తున్నారని ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కో యూనిట్ చొప్పున దళిత బంధు ప్రకటించి దళిత కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వం భావించి దళిత బందు పథకం ప్రవేశ పెట్టిందని ఏజెన్సీ ఏరియాలో ఉన్న దళితులకు ఇవ్వొద్దు అనడం సమంజసం కాదని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులకు కుడా దళిత బందు వచ్చే విదంగా గిరిజనులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆదివాసులను దోచుకున్న చరిత్ర కానీ వారిపై ఆధిపత్యం చేసిన చరిత్ర గాని దళితులకు లేవని ఆదివాసి ప్రాంతాలలో జీవిస్తున్న దళితులకు ఏజెన్సీ చట్టాల రూపకల్పంలోనే అన్యాయం జరిగిందని ఆదివాసి సోదరులకు ఏజెన్సీ దళితుల పట్ల సాను భూతి,సోదర భావం ప్రేమ కలిగి ఉండాలి తప్ప శత్రువులగా పరిగణించి ఆదివాసి చట్టాలకు వ్యతిరేక శత్రువులుగా చిత్రీకరించొద్దని తెలంగాణ మాల మహానాడు తరపున విజ్ఞప్తి చేస్తున్నమని తెలిపారు.
Attachments area