ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలి
-కలెక్టర్ కె.శశాంక
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్20 (జనంసాక్షి)
జిల్లా ప్రజలకు మరింత మెరుగైన బిఎస్ఎన్ఎల్ సేవలు అందించేందుకు అదనపు టవర్ల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బయ్యారం ,గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో బిఎస్ఎన్ఎల్ సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా అందించేందుకు గాను ప్రస్తుతం ఉన్న టవర్లకు అదనంగా టవర్ల ఏర్పాటుకు గాను ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. బిఎస్ఎన్ఎల్ టెక్నికల్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సాధ్య అసాధ్యాలను గుర్తించి స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇట్టి ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. మహబూబాబాద్ డివిజనల్ అధికారి పర్యవేక్షణ లో తహసిల్దార్లు, బిఎస్ఎన్ఎల్ సాంకేతిక అధికారుల సమన్వయంతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మహబూబాద్ ఆర్ డి ఓ కొమురయ్య, బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ రవికుమార్, బయ్యారం, గంగారం కొత్తగూడ, గూడూరు తాసిల్దార్లు ఏ రమేష్ ,
టి .సూర్యనారాయణ, సిహెచ్. నరేష్ ,
ఎం .అశోక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.