ఏజెన్సీ విద్యపై నిర్లక్ష్యం తగదు

ఏలూరు,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ఏజెన్సీలో గిరిజన విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.సాయికృష్ణ డిమాండ్‌ చేశారు. ఏడు గిరిజన మండలాలకు బుట్టాయిగూడెంలో ఒక్క డిగ్రీ కళాశాల మాత్రమే వుందని అన్నారు. ఈ కళాశాలకు కూడా సొంతభవనం లేదని అన్నారు. వెంటనే బుట్టాయిగూడెం డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అధ్వానంగా వున్న హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీలో విద్యారంగం అబివృద్ధిపై పాలకులు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. విద్యారంగ సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

తాజావార్తలు