ఏడాదిలో ‘రెండుసార్లు’ బోర్డు పరీక్షలు

` ఒత్తిడిని దూరం చేసేందుకే..
` కేంద్ర విద్యాశాఖ
ఢల్లీి (జనంసాక్షి):ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండిరటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు.ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఒకే ఒక్కసారి హాజరయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని.. దీన్ని తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాన్‌.. డవ్మిూ పాఠశాలలను విస్మరించలేమని, దీనిపై చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.’పది, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు విద్యార్థులకు ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష జేఈఈ మాదిరిగా రెండుసార్లు అవకాశం ఉంటుంది. అందులో ఉత్తమ స్కోర్‌ను వాళ్లు ఎంచుకోవచ్చు. అయితే, ఇదంతా ఐచ్ఛికమే.. తప్పనిసరి లేదు. ఆశించిన స్థాయిలో రాయలేదనే భయం, అవకాశం కోల్పోయామనే ఆందోళన, ఇంకా ఉత్తమంగా రాయొచ్చనే విషయాలను ఆలోచిస్తూ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అందుకే కొత్తగా ఈ ఐచ్ఛిక విధానాన్ని ప్రారంభిస్తున్నాం. ఒకవేళ తొలిదఫా పరీక్షల్లో మంచి స్కోరు వచ్చిందని భావిస్తే.. తదుపరి పరీక్షకు హాజరుకానవసరం లేదు’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఎన్‌సీఎఫ్‌ విధానాన్ని ప్రకటించిన తర్వాత విద్యార్థులతో ముచ్చటించానని.. దానిపై వారినుంచి సానుకూల స్పందన వ్యక్తమయ్యిందని చెప్పారు.రాజస్థాన్‌లోని కోటాలోని ఐఐటీ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇది చాలా సున్నితమైన విషయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం సమష్టి బాధ్యతని అన్నారు. ఈ క్రమంలో డవ్మిూ పాఠశాలల అంశాన్ని విస్మరించలేమని.. దీనిపై చర్చ జరగాల్సి ఉందన్నారు. కోచింగ్‌ అవసరం లేదని.. కేవలం పాఠశాల విద్య సరిపోయేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం న్యూ కరిక్యూలమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఔఅఈ) విధానాన్ని కేంద్ర విద్యాశాఖ ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. దీని ప్రకారం, బోర్డు పరీక్షలు ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశం కలగనుంది. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు వారి స్కోరును మెరుగుపరుచుకొనేందుకు అవకాశం లభిస్తుందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేఏడాది (2024) నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడిరచారు.