ఏడో వికెట్ కోల్పోయిన భారత్
ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 284 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. పనేసర్ బౌలింగ్ అశ్విన్ (68) ఎబ్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో టీం ఇండియా రెండో రోజు ఆటను ప్రారంభించింది.