ఏపార్టీతోనూ వైసీపీ పొత్తుపెట్టుకోదు

– టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది
– వైసీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం
శ్రీకాకుళం, జనవరి17(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ హక్కుల కోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని, వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. వైఎస్‌ జగన్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల భేటీపై పొత్తుల పేరుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రత్యేక ¬దా, విభజన హావిూల కోసం పోరాడుతునే ఉందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోను వైసీపీ పొత్తు పెట్టుకోదని.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు కేంద్రంతో అంటాకాగి ¬దాను నీరుగార్చారని విమర్శించారు. ¬దా వద్దని.. ప్యాకేజీ కావాలని చంద్రబాబు అనలేదా అని నిలదీశారు. పార్లమెంటులో ఇచ్చిన హావిూలకే దిక్కు లేకపోతే.. ఎవరిని ప్రశ్నించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాట విూద నిలబడటం లేదని ఆరోపించారు. ప్యాకేజీకి అంగీకరించిన టీడీపీ నేతలు కేంద్రమంత్రులకు సన్మానం చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ¬దా ఇవ్వలేదని చంద్రబాబు బీజేపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాజధాని భూముల అగ్రిమెంట్‌లు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో ఏపీని అవినీతి మయంగా మార్చారని విమర్శించారు. జన్మభూమి, ఇసుక పేరుతో తెదేపా నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ప్రజా సొమ్మును దోచుకున్నారని ధర్మాన ఆరోపించారు. టీడీపీ నేతల తీరుతో ప్రజలు విసుగుచెందారని, వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధర్మాన హెచ్చరించారు.