ఏపీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా?
– సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, జులై24(జనంసాక్షి) : ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌పై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..బంద్‌కు సహకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండగా..మధ్యలో పోలీసుల జోక్యం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో ఏమైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. గృహ నిర్బంధాలు, పోలీసు కేసులను ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి సానుకూలంగా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అహంకార ధోరణితో మాట్లాడారని ఆరోపించారు. అమరావతిలో రైల్వే డబుల్ లైన్‌కు గతంతో రూ.2679 కోట్లు కేటాయించి..ఇప్పుడు దానిని రూ.1732 కోట్లకు కుదించారని చెప్పారు. కేంద్రం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.