ఏపీ హక్కును..
తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఎవరు?
– కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఏపీకి అన్యాయం చేశాయి
– పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీ పెద్దలు మాటలు బాదేశాయి
– తెదేపా ఎంపీలంతా రాజీనామా చేయాలి
– 25మంది ఎంపీలు నిరాహారదీక్షకు కూర్చుంటే ¬దా ఎందుకు రాదో చూద్దాం
– ప్రత్యేక ¬దా ఎవరిస్తే.. వారికే తమ మద్దతు
– రాహుల్ ప్రత్యేక ¬దాపై అరనిమిషం కూడా మాట్లాడలేదు
– ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రానికి నిరసనగా 24న రాష్ట్రబంద్
– బంద్‌లో అన్ని సంఘాలు, పార్టీలు పాల్గొని సహకరించాలి
– విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్
కాకినాడ, జులై21(జనం సాక్షి) : అవిశ్వాస తీర్మానంపై ఏపీ పట్ల ఢిల్లీ పెద్దలకు ఉన్న ప్రేమ చూస్తే చాలా బాధేస్తోందని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. కాకినాడలో శనివారం ఉదయం జగన్ విూడియాతో మాట్లాడారు.. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రత్యేక ¬దాపై కాంగ్రెస్, భాజపాలు ఏమాత్రం మాట్లాడలేదని జగన్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీకి సంబంధించిన అంశాలపై అర నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. ¬దా ఐదేళ్లు కాదు.. పదేళ్లు అన్నవారికి పార్లమెంట్‌లో ఆ విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లైనా ఆంధప్రదేశ్‌కు ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఆమోదంతోనే ప్యాకేజీ ఇచ్చామని ప్రధాని అన్నారని జగన్ గుర్తుచేశారు. ¬దాకు బదులు ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల హక్కులను తాకట్టుపెట్టే అధికారం కేంద్రం, చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. లోక్‌సభలో ప్రత్యేక¬దాకు సంబంధించి ఎంపీ గల్లాజయదేవ్ మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా తమ పార్టీ చెబుతున్నవేనని పేర్కొన్నారు. జయదేవ్ మాటలు.. అసెంబ్లీలో మేం మాట్లాడిన మాటలు ఒకసారి చూడాలని కోరారు. ‘అప్పుడు మేం మాట్లాడితే నన్నుఅపహాస్యం చేశారు.. నేడు అవే మాట్లాడుతున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యేక ¬దా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. తిరుపతిలో ఎన్నికల వేళ తానే ప్రత్యేక ¬దాను 10ఏళ్లు ఇస్తానని చెప్పిన మాటలు మోదీకి గుర్తుకు రాకపోవటం బాదేస్తుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని హావిూలు ప్రధాని గుర్తుకు రాలేదన్నారు. రాష్ట్ర యువత ఉద్యోగాలు లేక వలసబాట పడుతున్నారని, ప్రత్యేక ¬దా వస్తనే పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని, టాక్స్ మినహాయింపు , జీఎస్టీలు కట్టాల్సిన పని ఉండదన్నారు. ఈ వెసులుబాటుతో కంపెనీలు ముందుకువస్తాయన్నారు. కానీ ఇంతటి కీలకమైన విషయంలో రాజీపడటానికి చంద్రబాబు ఎవరు? ఏపీ ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబులకు ఎవరిచ్చారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారని విూడియా అడిగిన ప్రశ్నకు వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఒక్క మాటతో తేల్చేశారు. కాకినాడ పాదయాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఎవరైతే ప్రత్యేక ¬దా ఇస్తామని సంతకం చేస్తారో వారికే మద్దతిస్తామని ఈ సందర్భంగా తేల్చిచెప్పేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రత్యేక ¬దా సంజీవని, పదిహేనుఏళ్లు కావాలన్నారు.. తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన
ప్రత్యేక¬దాకు ఏరకంగా తూట్లు పొడిచారో అందరం చూశామన్నారు. ఎన్నికలకు ఆరు నెలలు ముందు డ్రామాలు ఆడుతున్నార అన్నారు. తెదేపా ఎంపీలు ఇప్పటికైనా రాజీనామా చేయాలని, తెదేపా, వైసీపీ ఎంపీలు 25మంది కలిసి ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగితే దేశమొత్తం కదిలిస్తుందని జగన్ అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూడొచ్చన్నా. చంద్రబాబులో నిజాయితీ రావాలని, ఆయనపై ఒత్తిడి పెంచేందుకు, ఆయన ఎంపీలతో రాజీనామా చేయించేందుకు, వారికి అర్థం కావాలని ఈనెల 24న బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. ప్రతి పార్టీని, ప్రతి సంఘాన్ని బంద్‌లో పాల్గొని సహకరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.