ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్.

దౌల్తాబాద్ మండలంలోని ఏబీవీపీ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏబీవిపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ స్కూల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రవేట్ స్కూల్లో భారీగా పీసులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి, వేణు, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.