ఏరువాక సంబరాల్లో ఎడ్లకు అలంకరణ

సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉదయం ఎద్దులను ఆవులను శుభ్రపరిచి ఎద్దులను రకరకాల కలర్ లతో గంటలతో  వస్తువులతో అద్భుతంగా అలంకరించి పూజలు చేసి ఈ వర్షాకాలం అంత అద్భుతంగా రైతులకు పండించే పంటలు అధిక దిగుబడి రావాలని మొక్కుతున్నారు. సాయంత్రం ఎద్దులను ఎడ్లబడ్లతో గ్రామంలో వీధి వీధంతా ఎద్దులతో గ్రామంలో ఊరేగింపు చేయడం జరిగింది.