ఏసీబీకి చిక్కిన రేణిగుంట ఎంవీఐ
– ఏకకాలంలో 14చోట్ల దాడులు
రేణిగుంట, సెప్టెంబర్1(జనం సాక్షి) : రేణిగుంట ఆర్టీఓ కార్యాలయంలో ఎంవీఐగా పనిచేస్తున్న విజయభాస్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై విజయ భాస్కర్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. తిరుపతి, బెంగళూరు, అనంతపురం నగరాల్లో విజయభాస్కర్ బంధువుల ఇళ్లతో పాటు అధికారి పని చేస్తున్న రేణిగుంట చెక్‌పోస్ట్‌పై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 14 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, విలువైన పత్రాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
—————————