ఏ పార్టీలోనూ చేరను: వేణుగోపాలచారి
ఆదిలాబాద్, నవంబర్ 6 : ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. తన రాజకీయ పునర్జన్మ ఇచ్చిన ఇక్కడి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, నియోజక అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిష్టానికి విరుద్ధంగా నడుచుకోనని ఆయన పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో చేరబోనని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.