ఐఎస్ కీలక నేత హతం హఫిజ్
వాషింగ్టన్: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫిజ్ సయీద్ వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా ధ్రువీకరించింది. హఫిజ్ పాక్, ఆఫ్గాన్‌లలో ఐఎస్‌ను విస్తరించేందుకు కృషి చేస్తున్న కీలక ఉగ్రవాది. గత నెలలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో హఫిజ్ మరణించినట్లు తెలుస్తోందని అమెరికా రక్షణ విభాగం హెడ్‌క్వార్టర్స్ పెంటగావ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. జులై 26న ఆఫ్గాన్‌లోని నాన్‌గర్‌హర్ ఆచిన్ జిల్లాలో జరిగిన వైమానిక దాడుల్లో హఫిజ్ మరణించినట్లు చెప్పారు.
గతేడాది నాన్‌గర్‌హర్‌లో జరిగిన వైమానిక దాడుల్లో హఫిజ్ మరణించాడని అనుకున్నారు.. కానీ హఫిజ్ బతికే ఉన్నట్లు ఐఎస్ తెలిపింది. తాజా దాడుల్లో అతడు మరణించినట్లు తెలుస్తోంది.గత నెలలో ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఐఎస్ ఉగ్రవాదులు హజారా మైనార్టీ కమ్యూనిటీలోని షియా ముస్లింల ర్యాలీపై దాడులు చేసి 80 మంది ప్రాణాలు తీసి, 230 మంది గాయపరిచిన దారుణ ఘటన అనంతరం అమెరికా.. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది.