ఐక్యంగా మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి
– కామ్రేడ్ జేమ్స్ ప్రథమ వర్ధంతి సభలో వక్తల పిలుపు.
– పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు.
కేంద్రంలోని బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడే శక్తులు ముందుకు రావాలని సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటి కార్యదర్శి, ఇఫ్టూ జాతీయ నేత కదిరికోట జేమ్స్ ప్రథమవర్ధంతి సభలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా
సంఘాలకు చెందిన సభికులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మిగనూరు, సాగునూరు రోడ్డులో గల మంగళ హనుమంతు, జేమ్స్ భవనం(పార్టీ కేంద్ర కార్యాలయం)లో జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు-కూలీ సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి సభాధ్యక్షులుగా బి.ఏసేపు వ్యవహరించారు. జేమ్స్ సతీమణి కె.దానమ్మ, సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి, సిపిఐ(ఎం.ఎల్) ఆర్.ఐ. సెంట్రల్ కమిటీ మెంబర్ గడ్డం సదానందం, సిపిఐ(ఎం.ఎల్) భహుజన ప్రజారాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అనిశెట్టి రాము, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ సత్తెన్న, బాలరాజు, బీ.సి.సంఘం గణేష్, మాల మహనాడు రాష్ట్ర కార్యదర్శి నర్సన్న, నవ్యాంధ్ర ప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు అమరేష్, అడ్వకేట్ చార్లెస్, పీఓడభ్ల్యూ(విముక్తి) ఎం.పుణ్యవతి, ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి కె.నర్సన్న, జిల్లా కన్వీనర్ కెఎండీ అనీఫ్, హైదరాబాద్ కన్వీనర్ బడీగే వెంకటేష్, చేనేత సంఘం నీలకంఠ, పి.డి.ఎస్.యు.(ప్రభంజనం)కన్వీనర్ ఎం.ప్రకాష్, ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు కొలిమి ప్రసాద్, ఎస్.కె.సైదులు, సీనియర్ కార్మికోద్యమ నేత నేతప్ప, పివైఎల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బానోత్ సంతోష్ నాయక్, కర్నూలు జిల్లా కన్వీనర్ కె. చిన్ని ప్రసాద్, అరుణోదయ పి.సంపత్, ప్రజా కవి, కళాకారుడు రాంచంద్రన్న, విప్లవ అభిమానులు లక్ష్మణ్ తధితరులు పాల్గొని ప్రసంగిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధినిపై అయోద్య పీఠాధిపతి స్వామి పరమాహంస చేసిన హత్యా బెదిరింపులు చర్యలను ముక్త ఖంఠంతో ఖండించారు. భావ ప్రకటన స్వేచ్చపై మనువాద సిద్దాంత కాషాయ సంఘ్ పరివార్ శక్తులు లౌకిక ప్రజాస్వామిక వాదులపై జరుపుతున్న అన్నిరకాల హత్యలను, మణిపూర్, హర్యానా తదితర ఆదివాసి ప్రాంతాల్లో మతతత్వ విద్వేష రాజకీయ సామూహిక అత్యాచారాలను తీవ్రంగా ఖండించాలని కోరారు. సభ ప్రారంభంలో జేమ్స్ చిత్రపటానికి పూలమాలలతో ఆవిష్కరించి, సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనమైన విప్లవ నివాళులు అర్పించారు. చివరలో కామ్రేడ్ జేమ్స్ ఆశయసిద్ద కొరకు పోరాడుతామని సభికులు ప్రతిన బూనారు.