ఐక్యరాజ్యసమితి పై మండిపడ్డ భారత్

జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్‌పై నిషేధం విధించడంలో ఐక్యరాజ్యసమితి ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని, లేనిపోని రాజకీయాలు చేస్తోందని భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బ్లాక్‌లిస్టులో పెట్టినా, దాని అధినేత మసూద్ అజహర్ (48)ని మాత్రం ఇంకా నిషేధించలేదు. అజహర్‌ను నిషేధించాలంటూ భారతదేశం చేసిన ప్రతిపాదనను భద్రదతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా రెండుసార్లు అడ్డుకుంది. తమ దేశంలో ఈ ఏడాదే రెండుసార్లు జైషే మహ్మద్ సంస్థ దారుణమైన ఉగ్రదాడులకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపైన, తర్వాత సెప్టెంబర్‌లో ఉడీలోని సైనిక స్థావరంపైన ఉగ్రవాద దాడులు జరిగాయి. రెండు ఘటనల్లో కలిపి 26 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. masood-azhar-1