ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం
– 250 విూటర్ల ఎత్తులో టవర్ నిర్మాణం
– టవర్ ఆకృతిలో ఉన్న అసెంబ్లీ డిజైన్‌ను సీఎం ఫైనెల్ చేశారు
– ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు
అమరావతి, జులై27(జనం సాక్షి) : ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ కోసం టవర్ ఆకృతిలో ఉన్న డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుతో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో శుక్రవరాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనాల డిజైన్లపై తుది రూపు తీసుకొచ్చేందుకు కసరత్తు చేశారు. చివరకు టవర్ ఆకృతిలో ఉన్న అసెంబ్లీ డిజైన్‌ను సీఎం ఫైనల్ చేశారు.ఈ సందర్భంగా కోడెల మాట్లాడారు. శాశ్వత చట్ట సభల డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చర్చించినట్లు కోడెల తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతిపై కూడా చర్చించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి డిజైన్లపై పలు మార్పులు సూచించినట్లు వెల్లడించారు. అందం, ఆకర్షణెళి కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఐదు అంతస్థుల్లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. సెల్లార్‌లో సర్వీసులు, ఫస్ట్ ఫ్లోర్‌లో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ ఉంటాయన్నారు. రెండో అంతస్థులో మంత్రుల లాంజ్‌లు, మూడో ఫ్లోర్‌లో ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 250 విూటర్ల ఎత్తులో టవర్ వస్తుందన్నారు. లిఫ్ట్‌ల ద్వారా టవర్‌పైకి వెళ్లి నగర అందాలు వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.