ఐదు రాష్టాల్ల్రో నేడు కౌంటింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసని ఎన్నికల సంఘం
ఉదయం నుంచే వెలువడనున్న ఫలితాలు
ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయపార్టీలు
న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): దేశంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ మొదలు కానుంది. అన్ని పార్టీలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్టాల్ల్రో రాజకీయ అభ్యర్థుల భవితవ్యం ఈనెల 10న తేలిపోనుంది. కాగా ఇటీవల పలు ఎగ్జిట్‌ పోల్స్‌ పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుస్తుందని నివేదికలు ఇచ్చాయి. మొత్తం 117 స్థానాలకు ఆప్‌ 70 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకుంటుందని టైమ్స్‌ నౌ, ఇండియా టుడే, చాణక్య సంస్థలు చెప్పగా.. ఏబీపీ`సీ ఓటర్‌ మాత్రం ఆప్‌ 57, కాంగ్రెస్‌ 26, అకాలీదళ్‌ 24, బీజేపీ 10 గెలుచుకుంటుందని వెల్లడిరచింది. కానీ గెలుపు ఎవరిదో ఈనెల 10న స్పష్టం కానుంది. ఐదు రాష్టాల్ర ఎన్నికలపై యావత్‌ దేశం దృష్టి సారించింది. దీంతో ఇక్కడి రాజకీయ భవిష్యత్తుతో పాటు 2024 సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయి. గురువారం సాయంత్రానికి ఈ రాష్టాల్లో అధికారం ఎవరిది అన్నది తేలనుంది. అటువంటి పరిస్థితిలో, ఫలితాలకు ముందు, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్లలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు, సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు అవసరమో లెక్కలేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌ దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం పీఠం దక్కాలంటే, పూర్తి మెజారిటీ పొందడానికి, ఏ పార్టీకి అయినా 202 సీట్లు అవసరం. ఇక్కడ అధికార భారతీయ జనతా పార్టీ, సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పంజాబ్‌లో అత్యంత
గందరగోళం నెలకొంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీకి అవసరమైన సంఖ్య 59. ఇక్కడ అధికార కాంగ్రెస్‌, అకాలీదళ్‌, శిరోమణి అకాలీదళ్‌, బీజేపీ, ఆప్‌ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఉత్తరాఖండ్‌ పంజాబ్‌ లాగే ఉత్తరాఖండ్‌ కూడా గతేడాది చాలా అస్థిరతను చవిచూసింది. అధికార పార్టీ బీజేపీ గతేడాది ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 36. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది,. గోవా చిన్న రాష్ట్రమైనప్పటికీ గోవా ఎన్నికల సవిూకరణం చాలా ఆసక్తికరంగా మారింది. గత రెండేళ్లుగా ఇక్కడ రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలు కనిపించాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ మెజారిటీకి 21 సీట్లు అవసరం. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే పోటీ. ఇక్కడ అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. మణిపూర్‌ మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ మెజారిటీ కోసం 31 సీట్లు గెలవాలి. గత ఎన్నికల్లో అత్యధికంగా 21 సీట్లను గెలుచుకోవడం ద్వారా, ఎన్‌పిఎఫ్‌, ఎన్‌పిపి, ఎల్‌జెపితో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.