ఐపీఎల్ లో ఫైనల్స్‌కు చేరిన హైదరాబాద్ సన్ రైజర్స్ ….
హైదరాబాద్ : ఐపీఎల్ సిరీస్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్స్‌కు చేరింది. కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో గుజరాత్‌పై… రెండు విజయాలు నమోదు చేసుకున్న హైదరాబాద్ అదే రికార్డును కొనసాగిస్తూ కీలకమైన క్వాలిఫయర్-2లోనూ చిత్తుచేసింది. తొలుత గుజరాత్ 163 పరుగులు చేయగా… వార్నర్ విధ్వంసంతో.. 4 వికెట్లు మిగిలి ఉండగానే… సన్ రైజర్స్ లక్ష్యం సాధించింది. వార్నర్ 58 బంతుల్లో 93 పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈనెల 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్.. బెంగళూరుతో తలపడనుంది.