ఒకే రోజు 100కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్లు

dyt7cy3oప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే రోజు 100కోట్ల మంది ఆక్టివ్‌ యూజర్లను సాధించి రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగి స్తున్నారు. ఇందులో ప్రతిరోజు ఒక్కరూ రోజూ తమ ఖాతాను తెరిచే అవకాశం లేదు. కొందరు ప్రతి రోజూ తెరిస్తే కొందరు రెండు మూడు రోజులకు ఒకసారి తెరుస్తారు. వారానికి, నెలకు ఒకసారి తెరిచేవారు కూడా ఉన్నారు. ఎంతమంది ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ యూజర్లుగా ఉన్నారనే విషయం తెలుసుకునేందుకు దాని యాజమాన్యం ప్రతినెలా సగటు యాక్టివ్‌ యూజర్ల సంఖ్యను విడుదల చేస్తోంది. దానిలో భాగంగాఏ సోమవారర ఒకే రోజు 100 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రకటించింది. ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించడం ఫేస్‌బుక్‌ చరిత్రలో ఇదే తొలిసారి